ధర్మారెడ్డిని ధర్మంగా బదిలీ చేయాలి.. జనసేన హెచ్చరిక..!

*ధర్మారెడ్డి గారు నా పేరు కిరణ్ రాయల్.. మీరు బెదిరిస్తే భయపడం మా ముందు పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ ఉంది.. జాగ్రత్త..!

*ధర్మారెడ్డినే ఎందుకు కొనసాగింపు..?

*ఏపిలో ఇంకెవరు ఐఏఎస్ లు లేరా…?

*రాష్ట్రంలో జగన్ రాజ్యాంగం ఇకపై చెల్లదు..

*న్యాయస్థానాల్లో వై.సి.పి. ప్రభుత్వానికి అనేక సార్లు అపజయాలే …

*రాష్ట్రంలో ఐ ఏ ఎస్ లు లేరా… వారికి శ్రీవారి సేవ చేసుకునే భాగ్యం రాధా….

*వైకాపా ఫండింగ్ కోసమే.. ఇన్చార్జ్ ఇవో గా ధర్మారెడ్డి కొనసాగింపా….

*ధర్మారెడ్డి దేవస్థానంగా నడిచే.. టీటీడీని కాపాడుకునేందుకు.. భక్తులతో కలిసి అలిపిరి వద్ద ముట్టడిస్తాం….

*అ-ధర్మారెడ్డిని కోర్టుకులాగడానికైనా సిద్ధం.. న్యాయవాదితో కలసి జనసేన పార్టీ హెచ్చరిక….

తిరుమల తిరుపతి దేవస్థానం ఖజానాను వైకాపా ప్రభుత్వానికి తరలించడానికే టీటీడీలో ఇన్ఛార్జి ఈవోగా ధర్మారెడ్డి గడువు తీరినప్పటికీ బలంగా పాతుకుపోయి.. జగన్ రాజకీయ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని.. జనసేన పార్టీ న్యాయవాది ముక్కు సత్యవంతుడుతో కలిసి తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జి కిరణ్ రాయల్ విమర్శించారు.

సోమవారం మీడియా ముందు జనసేన నాయకులు రాజారెడ్డి, ముక్కు సత్యవంతుడు, ఆకేపాటి సుభాషిని, కీర్తన, లక్ష్మి, కోకిల, సుమన్ తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ.. గతవారం తాము ధర్మారెడ్డిని గడువు ప్రకారం బదిలీ చేయాలని, మీడియా ద్వారా డిమాండ్ చేసినా స్పందించకపోవడం లోనే వారి అధర్మ పాలన దాగి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధర్మారెడ్డి లో ధర్మం ఉండి ఉంటే ఆయనే ట్రాన్స్ఫర్ చేయించుకునే వెళ్లి ఉండేవాడని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఐఏఎస్ లేరా వారికి శ్రీవారి సేవ చేసుకునే భాగ్యం రాదా..? అని ఈ సందర్భంగాప్రశ్నించారు.

ఇలా టిడిపి పై ప్రశ్నలు వేసి నందుకు తనపై కేసులు కూడా పెట్టారని కిరణ్ తెలియజేశారు.. తన ముందు తమ “జనసేనాని” వెనక వీర మహిళలు, చుట్టూ జనసైనికులు ఉన్నంతవరకూ.. భయపడే ప్రసక్తే లేదని.. అధర్మాన్ని ప్రశ్నిస్తామని హెచ్చరించారు.. సీఎం జగన్ అవినీతి కేసులో 16 నెలలు జైల్లో ఉండి రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేయడం నేర్చుకున్నాడని గతాన్ని గుర్తు చేశారు.

టీటీడీలో ఐఏఎస్ చదవని వాళ్ళు కూడా చైర్మన్లుగా, ఈవోలు గా కొనసాగుతున్నారని.. ఇక ఐఎఎస్, ఐపిఎస్ లు చదవడం ఎందుకని లంచంతో అతి సులువుగా ఐఏఎస్ లు అయిపోవచ్చునని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.