నాదెండ్లను అక్రమ అరెస్టుకు కాకినాడ సిటీ ఆధ్వర్యంలో ధర్నా

కాకినాడ సిటీ, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో అక్రమ అరెస్టు చేసిన నేపథ్యంలో కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇన్చార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు కాకినాడ జనసేన పార్టీ శ్రేణులు స్థానిక ఇంద్రపాలెం వంతెన వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ ఆధ్వర్యంలోను, డైరీఫాం సెంటరు వద్ద దాసరి వీరబాబు ఆధ్వర్యంలోను ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగున్నర ఏళ్లలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నియంత్రత్వ పోకడలతో పాలనను కొనసాగిస్తుందని అన్నారు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు పౌరులకు ఇచ్చిందని కానీ ఆంధ్రప్రదేశ్లో దానికి భిన్నంగా ప్రశ్నిస్తే అరెస్టులు చేసే సంస్కృతిని ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని వాపోయారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య మాట్లాడుతూ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను విడనాడాలని పదవులు శాశ్వతం కాదని ముఖ్యమంత్రి గ్రహించాలని మరో మూడు నెలల్లో జనసేన తెలుగుదేశం పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టి పోతున్నారని ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. జనసేన పార్టీ కాకినాడ సిటీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ వైసిపి నియంతృత్వ పాలనతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ప్రభుత్వ విధానాలు ప్రతిపక్షాలను సైతం గౌరవించే విధంగా ఉండాలని కానీ ఈ ప్రభుత్వం ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం ద్వారా ఉన్న గౌరవాన్ని కోల్పోతారని ఈ విధానాన్ని విడనాడాలని హితవు పలికారు. నాదెండ్ల మనోహర్ ను తక్షణం విడుదల చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆట్ల సత్యనారాయణ, సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ,దారపు సతీష్, మనోహర్లాల్ గుప్తా, మిరియాల హైమావతి, చీకట్ల శ్రీనివాస్, సమీర్, డైరీఫాం సెంటరులో దాసరి వీరబాబు, సొరడ అజయ్ కుమార్, కొండ్ర దుర్గాప్రసాద్, వాసుపల్లి రామారావు, కుందు దన, మోసా ఆనంద్, ధోని దాసు, గంట దైవదాస్, కనగాల ధనరాజు, వాసుపల్లి కోటేశ్వరరావు, వాసుపల్లి కృష్ణ, మోస ఏసేబు, సూరాడ ప్రసాద్, అనిల్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.