మోదీకి కౌంటర్ గా మమత పాదయత్ర..

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం రంజుగా సాగుతోంది. ఆదివారం ప్రధాని మోదీ ర్యాలీతో ఈ ప్రచారానికి ఓ ఊపు రాగా.. ఆయనకు కౌంటర్‌గా సీఎం మమతా బెనర్జీ సిలిగురిలో మరో భారీ ర్యాలీ తీశారు. పెరిగిపోతున్న గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా ఓ గ్యాస్ బండతో ఆమె పాదయాత్ర చేయడం విశేషం. ఆమె వెంట వేలాది మంది మహిళలు సిలిండర్ కటౌట్లతో కనిపించారు. ఎన్నికల ముందు ఉజ్వల, ఎన్నికల తర్వాత జుమ్లా అని ఈ సందర్భంగా మమతా కౌంటర్ వేశారు. ప్రధాని ప్రతి రోజూ అబద్ధాలే మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు.

సిలిండర్ రానున్న రోజుల్లో సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్తుందని, మన గళాలను వినిపించాలంటే భారీ ప్రదర్శనలు తప్పవని ఆమె స్పష్టం చేశారు. పెట్రోల్‌, డీజిల్ ధరలు కూడా పెరిగిపోతున్నాయని, అందుకే తాను స్కూటర్‌పై ఆఫీసుకు వెళ్లానని ఈ సందర్భంగా మమతా చెప్పారు. మోదీ దేశాన్ని అమ్ముతున్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు, మహిళలకు, రైతులకు, యువతకు అందరికీ వ్యతిరేకమే. ఈ ప్రభుత్వం వెళ్లిపోవాల్సిందే అని ఆమె అన్నారు.