కాళహస్తి జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

శ్రీకాళహస్తి నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిని ఘాడ నిద్రలో ఉన్న సీఎం జగన్ రెడ్డికి తెలియజేసేలా చేపట్టిన డిజిటల్ కాంపెయిన్ #GoodMorningCMSir కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితిని పరిశీలించిన నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. రోడ్ల దుస్థితికి సంభందించిన వీడియోలను చిత్రీకరించి #GoodMorningCMSir అనే హాష్ టాగ్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో ప్రచురించడం జరిగింది. జూలై 15 నాటికల్లా ఒక్క గుంత కూడా ఉండదు అని చెప్పిన సీఎం ఒక్క గుంత కూడా పుడ్చని పరిస్థితి రాష్ట్రంలో నెలకొనింది. ఇకనైనా ఘాడ నిద్ర నుండి లేచి రోడ్లపై దృష్టి పెట్టాలని నిరసన చెయ్యడం జరిగింది. 5-10 కి.మీ ప్రయాణం చెయ్యాలన్నా సీఎం హెలికాప్టర్లో వెళ్తే ప్రజలు రోడ్ల వల్ల పడుతున్న ఇబ్బందులు ఎలా తెలుస్తుందని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.

  1. శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి సాయి బాబా గుడికి వెళ్ళే దారి పరిస్థితి!!
  2. శ్రీకాళహస్తి పట్టణంలోని తెట్టు నుండి వి.మయ్.పల్లికి వెళ్ళే దారి దుస్థితి!!
  3. శ్రీకాళహస్తి మండలం, ఉరందూరు హరిజనవాడ వద్ద రోడ్డు దుస్థితి!!
  4. శ్రీకాళహస్తి మండలం, జింగిలిపాళ్యం నుండి శ్రీకాళహస్తికి వచ్చే ప్రధాన రహదారి దుస్థితి!!
  5. శ్రీకాళహస్తి మండలం, రాజీవ్ నగర్ కాలనీ నుండి శ్రీకాళహస్తికి వచ్చే ప్రధాన రహదారి దుస్థితి!!