పార్వతీపురం జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గఒ, వీరఘట్టం మండలం, కంబరవలస గ్రామంలో #GoodMorningCMSir జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు రహదారి దుస్థితి గురించి జనసేన పార్టీ నాయకులు మత్స పుండరీకం మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి సుమారు 8 గ్రామల నుండి 600 మంది విద్యార్థులు వచ్చి వెళ్లే పాఠశాల ముందు రహదారి సరిగ్గా లేదు. ఈ బురదలో దిగి విద్యార్థులు, ఉపాద్యాయులు పాఠశాలలోకి వెళ్ళాల్సిందే. గ్రామంలోని ప్రజలు ఈ బురదలోదిగి పొలం పనులు, జిల్లా కేంద్ర, మండల కేంద్రామికి వెళ్ళిరావాల్సిందే. #GoodMorningCMSir పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి అంటారు. పాఠశాల ముందు ఇలా ఉంటే ఎలా సీఎం సార్. నాడు-నేడు నిధులతో పాఠశాలలు అభివృద్ధి చేసాము అంటున్నారు మరి పాఠశాలల ముందు ఉన్న రహదారి కనిపించలేదా సీఎం సార్ అని మత్స పుండరీకం ప్రశ్నించారు. జనసేన పార్టీ నాయకులు జనసేన జాని మాట్లాడుతూ ప్రతి జనసైనికుడు మీ గ్రామాల్లో ఉన్న రహదారుల గురించి #ఘూదంఒర్నింగ్ఛంశిర్ హ్యాష్ ట్యాగ్ ద్వారా సీఎం జగన్ తెలిసేలా సోషల్ మీడియా ద్వారా తెలపండి. వీరితోపాటు కర్నేన సాయిపవన్, కోడి వెంకటరావు, సుమన్, ప్రణీత్, దండేల సతీష్, వి.నాగభూషణం పాల్గొన్నారు.