తాడిపత్రి జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

తాడిపత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలపుమేరకు #GoodMorningCMSir అనే డిజిటల్ కాంపేయినింగ్ ని తాడిపత్రి పరిసర ప్రాంతాలలోని పప్పురు రోడ్డు, ఆటో నగర్ రోడ్డు మరియు సజ్జలదిన్నే హైవే రోడ్డుల దుస్థితిని ప్రభుత్వానికి తెలిసేలా జనసేన పార్టీ స్లొగన్స్ తో స్థానిక జనసేన పార్టీ నాయకులు కుందుర్తి నరసింహా చారి, చిరంజీవి రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు ఆటో ప్రసాద్ ఆధ్వర్యం అక్కడి రోడ్డు పరిస్తులని ఫొటోగ్రాఫ్, వీడియోగ్రఫీల ద్వారా సోషియల్ మీడియాలో పోస్టులు పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి కనపడేలా ఒక డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని 16,17 తేదీలలో కూడా తాడిపత్రి నియోజక వర్గంలో ఉన్న రోడ్ల దుస్థితిని రాష్ట్రమంతా తెలిసేలా సాంఘిక మద్యమల ద్వారా ప్రచారం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా జనసేన పార్టీ జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు మాధినేని గోపాల్, అచ్చుకట్ల అల్ప్తాఫ్ మరియు జనసైనికులు షేక్ సాధక్ వలి, షేక్ ఇమామ్ వలి, శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.