టిఎన్ఆర్ కుటుంబానికి డైరెక్టర్ మారుతి ఆర్థిక సహాయం
ప్రముఖ జర్నలిస్ట్ టిఎన్ఆర్ ఇటీవల కరోనా కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే దీంతో చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు టి ఎన్ ఆర్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. మొన్న మెగాస్టార్ చిరంజీవి తక్షణ సాయం కింద లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అలాగే వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అలాగే సంపూర్ణేష్ బాబు 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
ఇప్పుడు తాజాగా దర్శకుడు మారుతి కూడా తన వంతు సహాయ సహకారాలు అందించారు. 50 వేల రూపాయలను టిఎన్ఆర్ భార్య జ్యోతి బ్యాంక్ ఖాతా కు పంపించారు. ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సాయం చేయాలని కోరారు మారతి. ఇక మారుతి గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
It's time to show our solidarity for our friend in media
— Director Maruthi (@DirectorMaruthi) May 13, 2021
TNR we miss you, but we are with your family.
Let's support #TNR's family pic.twitter.com/rLUfavz9EX