జగనాసుర రక్త చరిత్రపై ఎన్డీఏ చార్జ్ షీట్ ఆవిష్కరణ

  • సబ్ ప్లాన్ నిధులకు అర్థం లేకుండా చేశారు కూటమి నాయకులు

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం: ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు అర్థం లేకుండా జగన్ ప్రభుత్వం చేసిందని టిడిపి తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ వలవల బాబ్జి విమర్శించారు. శనివారం తాడేపల్లిగూడెం ఎం వి ఆర్ గ్రాండ్ లో విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగనాసుర రక్త చరిత్రపై ఎన్డీఏ చార్జ్ షీట్ ను ఆవిష్కరించారు. బాబ్జీ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మీకు అవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందన్నారు. ఇతర రాష్ట్రాలు లేనివిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిందని ఆరోపించారు. కరెంటు సభ్యులను పదిసార్లు పెంచిన ఘనత ఏపీలోనే ఉందన్నారు. కేంద్రం ఇస్తున్న రాసిన బియ్యాన్ని సైతం సక్రమంగా అమలు చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగను పురస్కరించుకుని అందించే నిత్యావసర సరుకులు జగన్ ప్రభుత్వం తిలోధకాలిచ్చిందన్నారు. ఇంటింటికి రేష్మి కంపెనీ పేరుతో వ్యాన్లు కొనుగోలు చేసి వేల కోట్లు దుర్వినియోగం చేసిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయకపోగా కుప్పానికి నీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. పోలవరం ప్రాజెక్టు నాశనం చేసిందన్నారు. రాజధాని పేరు చెబితే వైజాగ్ ప్రజలు గగ్గోలు పెడుతున్నారన్నారు. రైల్వే జోన్ కు స్థలాలు, సౌకర్యాలు కల్పించకపోవడంతో జోన్ తీసుకురాలేకపోయిందన్నారు. రాష్ట్రం నుంచి 22 ఎంపీ స్థానాలు ఇస్తే స్పెషల్ స్టేటస్ను తుంగలో తొక్కిందని విమర్శించారు. స్పెషల్ స్టేటస్ గురించి కేంద్రంతో మాట్లాడిన సందర్భం లేదన్నారు. ఉమ్మడి కుటుంబం తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒకసారి అవకాశం ఇస్తే కేంద్రం మెడల్ నుంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని జగన్ చెప్పి నమ్మబలికారన్నారు. మరల అవి చేస్తాం ఇవి చేస్తాం అంటూ ప్రజల ముందుకు వస్తారని, దాని నుంచి ప్రజల్ని మేలుకొలుపే విధంగా ఎన్డీఏ చార్జ్ షీట్ ఆవిష్కరించడం జరిగిందన్నారు. రిషికొండ ఒక ఐకాన్ అని, అటువంటి రిషికొండను తవ్వేసి ఆ గ్రావెల్ ను ఎమ్మెల్యేలు, మంత్రులు అమ్మేసుకున్నారని ఆరోపించారు. ఇక్కడ డిప్యూటీ సీఎం తమ్ముడికి సైతం వందల కోట్ల లబ్ధి చేకూర్చిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఈ క్రమంలోని ఎన్నికల్లో ఓటుకు 3000 ఇస్తామని ప్రకటన పాలు పలుకుతున్నారు అన్నారు. కోవిడ్ సమయంలో రెండు లక్షల కోట్లు కేంద్రం ఆహార భద్రత మందుల కోసం ఇస్తే దానిలో సైతం ఎమ్మెల్యేలు లంచం తీసుకున్నారు అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన 12 లక్షల కోట్లతో రెండున్నర లక్షల కోట్లు పథకాల రూపంలో లబ్ది చేకూర్చినట్లు చెబుతుందన్నారు. మిగిలిన 8 లక్షల కోట్లు ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి నేత ఈతకోట తాతాజీ మాట్లాడారు. టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, కూటమి నాయకులు వర్తనపల్లి కాశి, పరిమి రవికుమార్, కిలపర్తి వెంకట్రావు, పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.