అల్లిన గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఆమదాలవలస నియోజకవర్గం: జనసేన నాయకులు, మండల అధ్యక్షులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, ఎంపీటీసీ అంపిలి విక్రమ్ మరియు కార్యకర్తలు ఆధ్వర్యంలో అల్లిన గ్రామంలో ఆదివారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్లి సభ్యత్వ కిట్లు అందజేయడం జరిగింది. మరియు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్లో జనసేన పార్టీ గుర్తు “గాజు గ్లాస్” పైన ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించవలసిందిగా విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సేపన రమేష్, రుంకు అనంతరావు, కిమిడి గణేష్, మాడుగుల కాశీ, మజ్జి శ్రావణ, సిరువరపు వెంకట్, రవి, వంశీ, వీరమహిళలు మరియు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.