దేవరపల్లి మండలంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

గోపాలపురం నియోజకవర్గం: దేవరపల్లి మండలంలోని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లను మండలంలోని 1631 సభ్యత్వాలు చేసిన 16 మంది వాలంటీర్లకు నియోజకవర్గ నాయకులు దొడ్డిగర్ల సువర్ణ రాజు, దేవరపల్లి మండల అధ్యక్షులు కాట్నం గణేష్, పార్టీ సీనియర్ నాయకులు అనిశెట్టి గంగరాజు, యాదవోలు గ్రామ అధ్యక్షులు అనిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో సభ్యత్వ కిట్లను అందజేయడం జరిగింది. గత సంవత్సరం దేవరపల్లి మండలంలోని సుమారు 900 సభ్యత్వాలు చేసినప్పటికీ, ఈ సంవత్సరం దానికి డబల్ 1631 సభ్యత్వాలను చేసి నియోజకవర్గ నాలుగు మండలాలలోను దేవరపల్లి మండలం అత్యధికంగా చేసి పార్టీని ఇంకొంత ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాత్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వాలను జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం, పార్టీకి అండగా నిలబడే ప్రతి జనసైనికుడు గ్రౌండ్ లెవెల్లో ఎంతో కష్టపడి పని చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్న జనసైనికులకి, వీరమహిళలకి యాక్సిడెంట్లుగా ఏదైనా జరిగితే 50వేల రూపాయలు, అదేవిధంగా ప్రాణాపాయం జరిగితే 5 లక్షల రూపాయలు అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన సొంతంగా సంవత్సరానికి కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కట్టి కార్యకర్తల నుండి 500 కట్టించుకోవడం జరిగింది. దానివల్ల ఆ కుటుంబానికి ఎంతో అండగా ఒక భరోసాగా ఉండడం జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా పార్టీలో పనిచేసే కార్యకర్తకి ఈ విధంగా అండగా నిలబడిన నాయకుడు లేడు. అది కేవలం మన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈ కార్యక్రమంలో దేవరపల్లి మండల నాయకులు చప్పటి శివ, జాజి మొగ్గల శ్రీనివాస్, గరిక రాజు తదితరులు పాల్గొన్నారు. క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన వాలంటీర్స్ కంబాల సత్తిబాబు 270, దోనెపల్లి శివ స్వామి 264, అనిశెట్టి మధుసూదన్ 253, పోలుమాటి నాని 157, గంధం అయ్యప్ప స్వామి 156, వర్ధినిడి నరేంద్ర 139, అయినాల నరసింహమూర్తి 130, పెనుపోతుల నరేష్ 66, మాలే సతీష్ 55, పాపోలు ప్రదీప్ కుమార్ 44, ప్రగడ ఆనంద్ 44, పాదం అనిల్ కుమార్ 36, కవల సీతారత్న కుమారి 15, కవల భరత్ 10, కనగర్ల రేవంత్ 1, సలాది వేణు మాధవి 1 చేయించడం జరిగింది.