ఆళ్లగడ్డలో వైభవంగా క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

ఆళ్లగడ్డ నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు పవణ్ కళ్యాణ్ ఆదేశాలమేరకు క్రియాశీలక కిట్లను పంపిణీలో భాగంగా ఆదివారం ఆళ్ళగడ్డలో మైలేరి మల్లయ్య, రామిశెట్టి బ్రహ్మేంద్ర కుమార్, పసుల నరేంద్ర యాదవ్, చలివెందుల రాజారామ్, బావికాడి గుర్రప్ప ఆధ్వర్యంలో జరిగిన ఆళ్లగడ్డ నియోజకవర్గం జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి నాయూబ్ కమాల్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకెపాటి సుభాషిణి, జనసేన పార్టీ రాయలసీమ వీరమహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి హసీనా బేగం, జనసేవాదళ్ రాష్ట్ర నాయకులు చల్లా వరుణ్, జనసేన పార్టీ ప్రోగ్రామింగ్, ఐటీ విభాగం, క్రియాశీల సభ్యత్వ వాలంటీర్స్, నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.