పండుగలా నరసరావుపేట నియోజకవర్గంలో 3వ రోజు జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీ..

నరసరావుపేట: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు.. నరసరావుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలాని ఆధ్వర్యంలో.. జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల బీమా పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. పలనాడు జిల్లా..ఏడు నియోజకవర్గాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యకర్తలను ఉద్దేశించి సయ్యద్ జిలాని మాట్లాడుతూ.. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు జనసేన పార్టీకి ఉన్నారని.. వారి కుటుంబ రక్షణకు పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొప్పగా ఆలోచించి ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని తీసుకు వచ్చారని.. ప్రమాదవశాత్తు కార్యకర్త ఎవరైనా చనిపోతే.. ఆ కార్యకర్త కుటుంబాన్ని ఆదుకునేందుకు పార్టీ తరపున 5 లక్షల రూపాయలు ఇచ్చి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ ఎన్నికలకు సిద్ధం కావాలని.. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ పార్టీతో కలిసి నడవాలన్నా.. మనందరం సిద్ధం వాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు అందరికీ నేను అండగా ఉంటానని.. ఇకమీదట పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని జనసేన పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ నాయకుడూ చేయని విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా పేరుతో కౌలు రైతులకు, తన సొంత సంపాదనలోని 30 కోట్లు రైతులకు ఆదుకుంటున్నారని, వారి నాయకత్వంలో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలని ప్రతి రైతు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జి వి ఎస్ ప్రసాద్, జిల్లా జనసేన అధికార ప్రతినిధి తవిటి భవన్నారాయణ, కటకం అంకారావు, సాంబశివరావు, నిశ్శంకర శ్రీనివాసరావు, అద్దేపల్లిఆనంద్ బాబు, బెల్లంకొండ ఈశ్వర్, అనిల్, వీరవల్లి వంశీ, ఆర్ కే యాదవ్, చెన్నుపల్లి సాంబ, అబ్దుల్ రవూఫ్, కృష్ణంశెట్టి గోవింద్, గుప్త శ్రీకాంత్, ఎస్ కే మౌలాలి, అచ్చుల సాంబశివరావు, ఎస్.డి గౌస్, మిరియాల సోము, దుర్గా కుమారి, రమ్య, నిర్మల, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, నాగుల్ మీరా, సంజయ్, విజయ్, కటారి హేమంత్, సంజీవరావు, యనమల కొండ, జమ్ముల బొర్రయ్య, మల్లిబాబు, దాసరి ఎలమంద, వల్లం శెట్టి శ్రీను, వాసు, ఉల్లి చంటి, మేడిశెట్టి రామారావు, రామిశెట్టి రామకృష్ణ, అశోక్, శివ, లక్ష్మీనారాయణ, కోసూరు రాముడు, కోసూరు ప్రవీణు, అలా వెంకటేశ్వరరావు, మల్లెల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.