కోవ్వాడలో క్రియాశీలక సభ్యుత్వ కిట్ల పంపిణీ

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కోవ్వాడ గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేనపార్టీ నాయకులు మరియు వాలంటీర్ గా పనిచేసిన పోట్నూరు లక్ష్మునాయుడు ఆధ్వర్యంలో కరిమజ్జి మల్లీశ్వారావు చేతులు మీదుగా జనసైనుకలకి ఆదివారం నాడు క్రియాశీలక సభ్యుత్వం కిట్లు పంపిణీ చేయడం జరిగింది. జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పూర్తితో ప్రజల్లో ప్రతిరోజు ఉండాలని ప్రజలకు అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ చేసిన సేవాకార్యక్రమాలు ప్రజల్లో ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోట రాముడు సూరాడ లక్షణ, మైలపిల్లి అప్పన్న, కోమలి సతీష్, కోమలి రాము, సూరాడ కృష్ణ ఆగ్రామ జనసైనుకులు తదితరులు పాల్గొన్నారు.