పుంగనూరు నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

పుంగనూరు నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నా రాయల్ ఆధ్వర్యంలో పుంగనూరు టౌనులో జనసేన సభ్యత్వ నమోదు కిట్లను పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఇవ్వడం జరిగింది. నియోజకవర్గంలో ప్రతి మండలంలో గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసుకున్న జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు, పార్టీ మద్దతు దారులకు జనసేన పార్టీ వాలంటీర్లు క్రియాశీలక కిట్లను అందిస్తారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసులు, పాముల హరి, పుంగనూరు టౌన్ నాయకులు మణికంఠ, తిరుమలేశ్, అష్రఫ్, జావేద్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.