దోసలుడికి గ్రామంలో క్రియాశీల సభ్యత్వ కిట్లు పంపిణీ

  • కిట్లు పంపిణీ చేసిన అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్

అనంతపురం జిల్లా, గుంతకల్లు నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు టీ సీ వరుణ్ సూచనల మేరకు, అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ గుంతకల్లు నియోజకవర్గం, గుంతకల్లు మండలం, దోసలుడికి గ్రామంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు కిట్లు అందచేసి అలాగే ప్రతి క్రియాశీలక సభ్యులు పార్టీని బలోపేతం దిశగా పనిచేసి గ్రామస్థాయిలో జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు ఆశయాలు తెలియచేసి పార్టీ బలోపేతానకి కృషిచేయాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రియాశీల సభ్యుడు మహేష్, దోసలుడికి గ్రామం క్రియాశీల సభ్యులు వీరేష్, రంగా, రంగనాయకులు, ఇంద్ర, రమేష్, తదితరులు పాల్గొన్నారు.