కాకినాడ రూరల్ జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

కాకినాడ రూరల్, కరప: క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. రెండవ రోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం కరప గ్రామం శ్రీ చిరంజీవి కళ్యాణ మండపంలో గ్రామ అధ్యక్షులు పేకెటి దుర్గాప్రసాద్ అధ్యక్షతన, కరప మండల సీనియర్ నాయకులు భోగిరెడ్డి కొండబాబు ఆధ్వర్యంలో.. క్రియాశీలక కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు పంతం పాల్గొని.. పార్టీ క్రియాశీలక సభ్యులకు బీమాపత్రాలు, కిట్లు, ప్రశంసా పత్రం, సభ్యత్వం, పార్టీ జెండా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ.. ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని.. దసరా నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టనున్న యాత్రను విజయవంతం చేయాలని.. పంతం నానాజీ పిలుపునిచ్చారు. రానున్న 2024 ఎన్నికలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఇటీవల జరిగిన సర్వేలో రాష్ట్రంలో 70శాతం మంది ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు  ఫలితాలు తెలుపుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అతి కొద్దిమందికే అందుతున్నాయన్నారు. ధాన్యం, కొనుగోళ్లలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు… తరువాత నడుకుదురు గ్రామంలో ఇంటింటికి వెళ్లి క్రియశిలక సభ్యత్వం కిట్లను వారికీ అందించడం జరిగింది.. అనంతరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ భోగిరెడ్డి గంగాధర్, కరప మండలం జనసేన పార్టీ క్రియశిలక వాలంటీర్లు, జనసేన నాయకులు, మండల కమిటీ నాయకులు, గ్రామ కమిటీ నాయకులు, ఎంపీటీసీలు, వైస్ సర్పంచులు, పంచాయితీ సభ్యులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.