చిరంజీవి అన్నదాన సత్రం ద్వారా అన్న ప్రసాదం వితరణ

రాజోలు: అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. మహోత్సవాలలో భాగంగా తరలి వచ్చిన భక్తులకు అన్నదాన సత్రం ద్వారా ఎన్నో వ్యయ ప్రయసాలు కూర్చి భక్తుల సౌకర్యార్థం ఉచిత అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన ఆర్గనైజర్ మెగా అభిమాని వులిశెట్టి లక్ష్మణరావు, తనతో పాటు నియోజకవర్గంలో గల గ్రామస్తులందరినీ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులు మరియు మెగా అభిమానుల సహకారంతో ముందుకు సాగుతున్న లక్ష్మణరావుకు మరొక్కసారి రాజోలు నియోజకవర్గ జనసేన తరపున హృదయ పూర్వక ధన్యవాదాలుతెలిపింది.