డ్రోన్ల ద్వారా ఔషధాల పంపిణీ.. ప్రారంభించిన కేంద్రమంత్రి సింథియా, తెలంగాణ మంత్రి కేటీఆర్

దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల సాయంతో ఔషధాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ‘మెడిసిన్‌ ఫ్రం స్కై’ పేరుతో వికారాబాద్‌లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు చేపట్టారు. రవాణా సౌకర్యం లేని అటవీ ప్రాంతాలకు దీని ద్వారా మందులు సరఫరా చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

డ్రోన్‌లో ఔషధాల బాక్సులను పెట్టి జ్యోతిరాదిత్య సిందియా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3 డ్రోన్లలో ప్రయోగాత్మకంగా మందులు, టీకాలు పంపించారు. ఔషధాలను వికారాబాద్‌ ప్రాంతీయ ఆస్పత్రిలో డ్రోన్లు డెలివరీ చేశాయి.