రాపాక ఆధ్వర్యంలో వికలాంగులకు నిత్యవసర వస్తువుల పంపిణీ

రాజోలు నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజోలు జనసేన నాయకులు, చింతలమోరి సర్పంచ్ డాక్టర్ రాపాక రమేష్ బాబు ఆధ్వర్యంలో మల్కిపురం ఏ ఎఫ్ డి టి కాలేజీ గ్రౌండ్ నందు జనసేన పార్టీ పిలుపుమేరకు “సామాజిక కార్యక్రమాలలో భాగంగా పేదలైన వికలాంగులకు అవసరమైన వస్తువులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మందికి పైగా వికలాంగులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు లింగోలు పెద్దబ్బులు, గుండుబోగుల పెదకాపు, తాడి మోహన్, పినిశెట్టి బుజ్జి, గుబ్బల ఫణికుమార్, సూరిశెట్టి శీను, గెడ్డం ప్రసాద్, పొన్నాల ప్రభ, జిల్లా కార్యదర్శి గుండబత్తుల తాతాజీ, గుబ్బల రవి కిరణ్, బైరా నాగరాజు, మట్టా సత్తిబాబు, ఉల్లంపర్తి దర్శనం, కొనతం నరసింహారావు, బైరా నాగరాజు, పొన్నాల ప్రభ, బొమ్మిడి ఏడుకొండలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.