నిడదవోలు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

నిడదవోలు నియోజకవర్గం: నిడదవోలు మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిడదవోలు మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలం అధ్యక్షులు పోలిరేడ్డి వెంకటరత్నం ఉదయం శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో పవన్కళ్యాణ్ గారి పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉనకరమిల్లి గ్రామంలో మెగా రక్తదాన శిభిరం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం రక్తం ఇచ్చి ప్రారంభించారు. అనంతరం పెద్ద ఎత్తున మండలం జనసైనికులు రక్తదానం చేశారు. ఆ గ్రామంలో ఎంపీపీ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణి చేశారు. అనంతరం కలవచర్ల గ్రామంలో వృద్ధ మహిళలకు చీరలు పంపిణి చేశారు. పెండ్యాల గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో దివ్యంగులకు, వృద్దులకు నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. అనంతరం డి. ముప్పవరం సెంటర్లో భారీయేత్తున కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్సులు పాల వీరాస్వామి, ఉలుసు సౌజన్య, నిడదవోలు మండలం జనసేన నాయకులు, మండలం కమిటీ సభ్యులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.