అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ

అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి మండలం, జనసేన పార్టీ నాయకులు అక్షయ ఫౌండేషన్ అధినేత మాదివాడ వెంకటకృష్ణ (క్రిస్టియన్) ఆధ్వర్యంలో ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, ఉమ్మడి కృష్ణాజిల్లా నాయకులు, కార్యదర్శులు, అవనిగడ్డ నియోజకవర్గం మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.