పలుకుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చిన గరికపాటి

ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో దర్శి నియోజకవర్గ స్థాయిలో జనసేన నాయకులు గరికపాటి వెంకట్ సోమవారం పలు కుటుంబాలను కలుసుకొని వారి బాగోగులను తెలుసుకొని వారికి మనోధైర్యాన్ని నింపారు. కొంతమేర ఆర్థిక సహాయం అందించి కుటుంబాన్ని ఓదార్చారు. దొనకొండ మండలం గుట్ట మీద పల్లెలో జనసేన కుటుంబ సభ్యుడైన గోరంట్ల వెంకటరావు ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారి కుటుంబంలో ఒకరిని కోల్పోవడం చాలా బాధ కలిగిస్తుందని వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వంతుగా కొంత ఆర్థిక సహాయం అందించి వారికి ధైర్యాన్ని కలుగజేశారు. అదేవిధంగా దొనకొండ లోని కొదమల ప్రవీణ్ ఇంటికి వెళ్లి వారి బాగోగులు తెలుసుకొని వారికే కొంత సహాయం అందించిన వెంకట్ ను పలువురు అభినందించారు. దొనకొండ మండలం ఎర్రబాలెం గ్రామంలో సగిణాల భూతప్ప వారిని ఓదార్చారు. దొనకొండ మండలం రామాపురం గ్రామంలో మన పార్టీ సానుభూతిపరులు ముఖ్య నేతలైన పలువురిని ఆయన కలుసుకొని వారితో కొద్దిసేపు పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అదేవిధంగా గ్రామంలోని ముఖ్యులైన చిన్న కాశయ్య కుటుంబానికి కూడా కొంత ఆర్థిక సాయం అందించారు. ఇలా దర్శి దొనకొండ మండలాలలో మన గరికపాటి వెంకట్ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పేద ప్రజల బాగోగులను తెలుసుకొని ఇంటింటికి వెళ్లి ఓదార్చడం, పలువురు ముఖ్యనాయకులకి ఆదర్శంగా నిలిచారని గరికపాటి వెంకట్ ని అభినందించారు.