జనసేన కార్యకర్తలకు సన్మానం మరియు క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

నంద్యాల జిల్లా, నంద్యాల నియోజకవర్గం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో త్రినేత్ర హోటల్ నందు నిర్వహించిన కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య నారాయణ, జనసేన రాష్ట్ర కార్యదర్శి నాయబ్ కమల్, జనసేన పార్టీ కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, కర్నూల్ జిల్లా నాయకులు చింత సురేష్ బాబు, హర్షద్ షేక్, నంద్యాల నాయకులు పిడతల సుధాకర్, పబ్బతి రవి, జనsEన పార్టీ రాయలసీమ వీరమహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి హసీనా బేగం, కర్నూలు జిల్లా నాయకుడు చల్ల వరుణ్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్రియాశీల కార్యకర్తలను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం నంద్యాల జనసేన నాయకుడు పిడతల సుధాకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.