జనసేన పార్టీ ప్రమాద బీమా చెక్కుల పంపిణీ

రామచంద్రపురం: జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ క్రియాశీలక కార్యకర్తల క్షేమం కోసం ఏర్పాటు చేసిన యాక్సిడెంటల్ బీమా పథకం ద్వారా ఆదివారం రామచంద్రపురం రూరల్ మండలం ఏరుపల్లి గ్రామంలో పాలూరి వీర వెంకటేశ్వర్లు ఇటీవల ప్రమాదవశాత్తు గాయాలకు గురైన క్రియాశీలక సభ్యత్వం కలిగిఉన్నందున రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ వారి ఇంటికి వెళ్లి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందజేసిన 28,000 రూపాయల చెక్కును పాలూరి వీర వెంకటేశ్వర్లు, శ్రీమతి పాలూరి సురేఖలకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షులు పోతాబత్తుల విజయకుమార్, ఎరుపల్లి ఎంపీటీసీ సాక్షి శివకృష్ణ కుమార్, జనసేన 3వ వార్డు మెంబర్ అబ్బిరెడ్డి పోతురాజు, తదితర ఎరుపల్లి గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.