జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ

అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజలు ఫోన్ చేసి మరీ సభ్యత్వం చేయించుకున్నారు.. జనసేన పార్టీ కోసం.. పవన్ కళ్యాణ్ కోసం.. బంధువుల, చుట్టుపక్కల నివాసం ఉండే వాళ్లని ఇప్పటి నుంచే జనసేనకు ఓటు వేసే విధంగా అహర్నిశలు కష్ట పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ సారి జనసేన కు ఓటు వేయాలి అని పదిమందికి తెలుపుతున్నారు. అని చెబితే ఆశ్చర్యమేసింది.. రాజకీయ అనుభవం లేకుండా రాజకీయాలంటే ఏమిటో తెలియదు అయినా జనసేన గెలుపు కోసం పని చేస్తున్నాము అని చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది.. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మేము కూడా ప్రచారంలో దిగుతాము ధైర్యంగా చెబుతున్నారు.. మాలాంటి యువతనే కాదు ఇలాంటి మహిళలను కూడా ధైర్యంగా రాజకీయాల్లో అడుగు వేసే విధంగా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన మార్పు ఇది.