భైరవపట్నం గ్రామ వేదికగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

  • ఘనంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో క్రియాశీలక కార్యకర్తల ప్రమాద బీమా కిట్లు పంపిణీ కార్యక్రమం.

ఉమ్మడి కృష్ణాజిల్లా, కైకలూరు నియోజకవర్గం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో భైరవపట్నం గ్రామ వేదికగా జరిగిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మరియు క్రియాశీలక కార్యకర్తల ప్రమాద భీమా కిట్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ముదినేపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు మరియు సంయుక్త కార్యదర్శుల ఆధ్వర్యంలో సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సిరిపురపు రాజబాబు, జిల్లా కార్యదర్శి సి ఏ బి.వి రావు, కృష్ణా జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ మెంబెర్ చెన్నంశెట్టి చక్రపాణి, కైకలూరు నియోజకవర్గ నాయకులు నల్లగోపుల చలపతి, కొల్లు బాబీ, జనసేన పార్టీ వీర మహిళ తోట లక్ష్మీ, మోటేపల్లి హనుమాన్ ప్రసాద్, నాలుగు మండలాల అధ్యక్షులు, నాయకులు, భారీ ఎత్తున జనసేనపార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.