కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో.. బ్రహ్మసముద్రం, సెట్టూరు, కుందుర్పి, కంబదూరు మండలాలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం మరియు జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ సూచనలతో.. ముఖ్య అతిథులు అనంతపురం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు నాగేంద్ర, జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శులు బాల్యం రాజేష్, రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్ చేతుల మీదుగా జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, 5 లక్షల రూపాయల బీమాతో కూడిన క్రియాశీలక సభ్యత్వం యొక్క కిట్లను అందించడం జరిగింది… ఈ సమావేశంలో ముఖ్య అతిథులు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగేంద్ర మాట్లాడుతూ.. 2024 లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యమని ప్రసంగించారు. ఈ సమావేశాలలో మండల అధ్యక్షులు మరియు మండల కమిటీ నాయకులు, క్రియాశీలక సభ్యులు, జన సైనికులు పాల్గొనడం జరిగింది.