తలవరంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు నాయకత్వంలో వీరధట్టం మండలం, తలవరం జనసేన పార్టీ నాయకులు వండాన సాయి కిరణ్ బుధవారం తలవరం గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసైనికులును ఉద్దేశించి మాట్లాడుతూ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రుల చేత ఓట్లు వేయించి జనసేన పార్టీ గెలుపుకు సహకరించాలని కోరడం జరిగింది.