విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటానికి జనసేన పూర్తి మద్దతు: రామ శ్రీనివాస్

  • విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు.. అఖిల పక్షనేతల ఆధ్వర్యంలో నిరసన నిరాహారదీక్షలు
  • విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటానికి సంఘీభావం తెలిపిన రామ శ్రీనివాస్

అన్నమయ్యజిల్లా కేంద్రం, రాయచోటి కలెక్టరేట్ ఎదుట ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే కార్యక్రమంలో భాగంగా.. అఖిల భారత కమ్యూనిస్ట్, సి.పి.ఐ, ఏఐటీయూసీ వారు చేపట్టిన నిరసన నిరాహారదీక్ష శిబిరానికి జనసేన తరపున మద్దతు కోరగా సంఘీభావం తెలుపుతూ.. జనసేన నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ గతంలో జనసేన డిజిటల్ క్యాంపైన్ ద్వారా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అని లోకసభ సమావేశాల్లో వైసీపీ ఎంపీల భాధ్యతను గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా వైసీపీ పాలకులు రాష్ట్ర ప్రజలను ఒక అవకాశం కోరి 151 అసెంబ్లీలు, 23 లొక్ సభ సీట్లు ప్రజలు నుంచి మద్దతు తీసుకుని ప్రభుత్వ పరిపాలనా విధానం చేతకానితనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా అవసరాలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను పక్కన పెట్టి, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలకు అనోవసరమైన పథకాల పేరుతో లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేసి నవరత్నాల పధకాల పేర్లతో ప్రజలకు కొండంత ఆశలు కల్పించి, అరకొర అభివృద్ధి పనులు చూపిస్తూ వారి వ్యక్తిగత స్వార్ధ స్వప్రయోజనాలు రాజకీయ లబ్ధికోసమే తప్ప ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు, పాలకులకు తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజంపేట ఎంపీ, పార్లమెంట్ ప్యానెల్ స్పీకర్ మిదున్ రెడ్డి మరియు వైసీపీ ఎంపీలదే అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రవేటికరణను ఆపేంత వరకు ఇటువంటి ఉద్యమాలను ఉదృతం చేస్తామని వైసీపీ పాలకుల చేతకానితనాన్ని ప్రజలు ముందు పెడతామని హెచ్చరించరించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి అసంబ్లీ జనసేన ఇంచార్జ్ షేక్ హసన్ భాష, జిల్లా కార్యక్రమాల సభ్యుడు షేక్ రియాజ్, మస్తాన్, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.