జనసేన ఆధ్వర్యంలో అనాధాశ్రమానికి నిత్యావసరాల పంపిణీ

అరకు నియోజకవర్గం, హుకుంపేట మండలం బారాపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జనసేన పార్టీ మండల నాయకులు పరాధాని సురేష్ ఆధ్వర్యంలో హుకుంపేట మండలం, మఠం గ్రామంలో ఉన్న ఆదివాసీ అనాధ ఆశ్రమానికి రెండు బియ్యం బస్తాలు, 5కేజిల పప్పు అందజేశారు. అక్కడ ఉన్న బాలికలకు ఆశ్రమంలోని సిబ్బందికి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ యొక్క విలువలతో కూడిన రాజకీయ విషయాలు వారికి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో హుకుంపేట మండల జనసైనికులు పి.చంటి, కె.రాజ్ కుమార్, పి.జయరాం, కె.ప్రదీప్ కుమార్, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.