జనసేన ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ కోటమ్మతల్లి ఉత్సవాలలో పులిహోర, మజ్జిగ పంపిణి
విజయనగరం, కొట్టాం శ్రీశ్రీశ్రీ కోటమ్మతల్లి అమ్మవారి పండగ సందర్భంగా మంగళవారం జనసేన నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో పులిహోర, మజ్జిగ పంచడం జరిగింది. దీనికి జిల్లా నాయకులు వబ్బిన సన్యాసినాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కొట్టాం జనసేన కార్యకర్తలు సురేంద్ర, రాంబాబు, ఏళ్లరావు, లక్ష్మణరావు, సన్యాసిరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు మాట్లాడుతూ… ప్రతి సామాన్యుడికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.