పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పార్వతీపురంలో మొక్కల పంపిణీ

  • పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పార్వతీపురం మెయిన్ రోడ్ లో “మొక్కలు పంపిణీ” కార్యక్రమం
  • మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పట్టణ ప్రజలు
  • జనసేన పార్టీ సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అని ప్రజలకు వివరిస్తూ మొక్కలు పంపిణీ చేసిన జనసేనపార్టీ నాయకులు

పార్వతీపురం మెయిన్ రోడ్డులో గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా “మొక్కలు పంపిణీ” కార్యక్రమం పార్వతీపురం నియోజకవర్గ నాయకులు ఆధ్వర్యంలో చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు చందక అనీల్, గోర్లీ చంటి, రజన రాంబాబు, రెడ్డి కరుణ, మనేపల్లి ప్రవీణ్, సీతానగరం మండల అధ్యక్షులు పాటి శ్రీను, పార్వతీపురం ఐటీ కోఆర్డినేటర్ పైలా సత్యనారాయణ, మండల శరత్, కడగాల శ్యామ్ సుందర్, ఉబ్బిసెట్టి సాయి, సంబాన రమేష్, బుగత సాయి, శిరిపురపు పైడిరాజు, పోలినాయిడు, రెడ్డి నాగరాజు, తరకేష్, శ్రీను, అజయ్ తదతరులు మాట్లాడుతూ జనసేనపార్టీ సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం అని అలాగే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ వైసీపీ నాయకులు మన పర్యావరణాన్ని ఎంతలా నాశనం చేస్తున్నారో అని ప్రజలకు వివరిస్తూ మొక్కలు పంపిణీ చేసి అలాగే 2024 అసెంబ్లీ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఈ కార్య్రమానికి విచ్చేసిన జనసేనపార్టీ నాయకులుకు, జనసైనికులకు ధన్యవాదాలు తెలుపుకుంటు ముగించారు.