చౌడువాడ యువతకు వాలీబాల్ కిట్టు పంపిణీ

మాడుగుల నియోజకవర్గం, కె. కోటపాడు మండలం, చౌడువాడ పంచాయతీలో నియోజకవర్గ నాయకులు రాయపరెడ్డి కృష్ణ ఏర్పాటు చేసిన వాలీబాల్ కిట్టును కె.కోటపాడు జనసేన నాయకులు అంజిబాబు ఆధ్వర్యంలో చౌడువాడ జనసేన నాయకులు, శివ, మల్లునాయుడు, అర్జునరావు, అప్పారావు, వాసుల చేతులు మీదగా కిట్టు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు సాయి, గణేష, ఇస్మార్ట్ శంకర్, బంగారు నాయుడు, రవి, వరం బాబు, రాజు, నరసింగ, హరీష్, సంతోష్, జగదీష్, ముత్యాల నాయుడు, సంజు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.