ఫ్లెక్సీల నిషేధంపై జనసేన చిల్లపల్లి విజయం

మంగళగిరి: ఇటీవల కాలంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధం అంటూ ఒక సభాముఖంగా ప్రసంగించడం తెలిసిందే. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ను కలిసి వారి సమస్యను జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళమని, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధం అని ప్రకటించడం మాకు చాలా బాధాకరంగా ఉందని, దాదాపు 10 లక్షల కుటుంబాలు ఈ రంగం పైన ఆధారపడి జీవిస్తున్నామని కనీసం మాకు కొంత సమయం ఇస్తే బాగుంటుందని, ఇప్పుడు అర్దాంతరంగా వ్యాపార ఆపేస్తే మా బతుకులు రోడ్డు పాలవుతాయని ఎలాగైనా ఈ సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి జనసేనపార్టీ తరఫున మాకు, మా కుటుంబాలకు అండగా నిలవాలని బాధితులు కోరడం జరిగింది. ఈ సమస్యపై స్పందించిన చిల్లపల్లి శ్రీనివాసరావు మీ సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానని వాళ్లకి భరోసా ఇవ్వటమే కాకుండా నా వంతు సాయంగా నేను మీకు అండగా ఉంటానని హైకోర్టు లాయర్ తో మాట్లాడి అసోసియేషన్ సభ్యులు చేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం జరిగింది. హైకోర్టులో పిటిషన్ ను పరిశీలించి న్యాయస్థానం అసోసియేషన్ సభ్యులకు కొంత ఉపశమనం ఇచ్చే విధంగా తీర్పు ఇవ్వటం జరిగింది. నిషేధం ప్లాస్టిక్ ఫ్లెక్సీలు మాత్రమే పరిమితం చేస్తూ పివిసి ఫ్లెక్సీలు జోలికి వెళ్లొద్దని ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్లెక్సీ ప్రింటర్లను రోడ్డున పడవేస్తున్న జీవో నెంబర్ 65 పివిసి ఫ్లెక్సీ లకి వర్తించదని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 22 కి వాయిదా వేసింది. దీంతో ఫ్లెక్సీ ప్రింటర్లకు ఊరట లభించింది. మా సమస్యకి మా వెంట ఉండి పోరాడినందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మరియు మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు కు అసోసియేషన్ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు.

ప్లెక్సీల నిషేధంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

భాగస్వాములకు నోటీసులివ్వకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు..?. పరిశ్రమపై వేలాది మంది వ్యాపారులు, కార్మికులు ఆధారపడి ఉన్నారు, నిషేధం విషయంలో చట్ట నిబంధనలకు లోబడి వ్యవహరించలేదు. దుందుడుకుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. న్యాయ సమీక్షకు వస్తే విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. ప్లెక్సీలు నిషేధించే క్రమంలో చట్ట నిబంధనలకు లోబడి ప్రభుత్వం వ్యవహరించలేదు. ఓవెన్, పీవీసీ ప్లెక్సీలకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వర్తించవని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.