చిరంజీవి, పవన్ కళ్యాణ్ లపై తప్పుడు వాఖ్యలను ఉపసంహరించు కోవాలి: పితాని

  • బేషరతుగా క్షమాపణ చెప్పాలి
  • వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ వీడి జనసేనాని ప్రశ్నలకు జవాబు చెప్పాలి
  • జనసేన నేత పితాని బాలకృష్ణ డిమాండ్

ముమ్మిడివరం నియోజకవర్గం: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మెగాస్టార్ చిరంజీవి గారి ప్రసంగాన్ని తప్పు పడుతూ ఆయనపై అవమానకారంగా వాఖ్యలు చేయడం వైయస్సార్సీపీ దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతుందని, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ గార్ని పలు విధాలుగా అసభ్యకరంగా మాట్లాడిన మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ప్రస్తుత మంత్రి అంబంటి రాంబాబు, మిగిలిన మంత్రులు మరియు ఎమ్మెల్యేల తీరు అత్యంత హేయమని జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ఆ వాఖ్యలను వారు తక్షణమే వెనక్కు తీసుకోవాలని, వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఈ విధంగా అసలు విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్సించారు. పంచాయతీల నిధులను ప్రభుత్వం స్వాహా చేస్తూ గ్రామ పంచాయితీలను నిర్వీర్యం చేస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామ స్వరాజ్యం వైసేపీ పాలనలో అపహాస్యం అయ్యిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ విధానాలను గురించి నిలదీసి అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేని రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. కొడాలి నాని పకోడీ..పకోడీ అని వాఖ్యలు చేయడంపై మండిపడిన ఆయన మంత్రి పదవి పీకేసినా పనికి మాలిన వాగుడు వాగుతున్న కొడాలి నానికి మించిన పకోడీగాడు ఎవరు లేరని విమర్శించారు. మంగళవారం లంకగ్రామాలకు వచ్చిన ముఖ్యమంత్రి వరద సాయం బాధితులందరికి అందినట్లుగా అబద్ధాలు వల్లె వేయడం సిగ్గు చేటని అన్నారు. గత మూడు రోజులనుండి కొంతమందికి ట్రయినింగ్ ఇచ్చి ముఖ్యమంత్రి సమక్షంలో మాట్లాడించడం వైసీపీ నేతల దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతుందని అన్నారు. కొద్దిమందికి మాత్రమే వరదసహాయం అందిందే తప్ప బాధితులందరికీ అందలేదన్నారు. ముమ్మిడివరంలో తాను మూడు రోజులు పాటు వరదబాధితులను పరామర్శించిన క్రమంలో బాధితులు తమకు సహాయం అందలేదని ఆవేదన వ్యక్తంచేశారని వివరించారు. మెజారిటీ బాధితులను ఇప్పటికీ పట్టించుకోని ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలతో తమ వైఫ్యల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అబద్దపు ప్రచారం చేస్తోందని అన్నారు. ఈ ధోరణిని మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డైవర్సన్ పాలిటిక్స్ చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇకనైనా కళ్ళు తెరచి ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవాలని కనీసం ఈ ఆరు నెలలైన సక్రమమైన పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందించాలని పితాని బాలకృష్ణ డిమాండ్ చేశారు.