ఆర్ఆర్ఆర్ నుండి దీపావళి సర్‌ప్రైజ్..

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం ఈ దీపావళికి మరో సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్దమైంది. ఈ దీవాళిని మరింత స్పెషల్‌గా మార్చేందుకు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కొత్త ప్లాన్‌తో రాబోతున్నారు. ఈ ముగ్గురి కలిసి దిగిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తున్న మన హీరోలని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన వీడియోలు అభిమానుల అంచనాలను మరింత పెంచాయి.