అధికార పార్టీకి కొమ్ము కాయ కుండా.. అందరికీ సముచిత న్యాయం చేయండి: గాదె వెంకటేశ్వరరావు

అమరావతి మండలం, లింగాపురం గ్రామంలో సోమవారం రాత్రి వైసిపి నాయకులు పోలీసుల సహాయంతో జనసేన ఫ్లెక్సీలు తొలగిస్తుంటే జనసైనికులు అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో అధికార పార్టీ వాళ్లు పోలీసుల సహాయంతో బెదిరించి.. ఫ్లెక్సీలను జనసేన పార్టీ వి మాత్రమే తొలగించే ప్రయత్నం చేయగా జనసేన పార్టీ కార్యకర్త పెరుమాళ్ళ వీరాంజనేయులు తమ పార్టీ ఫ్లెక్సీలను తొలగిస్తున్న సందర్భంలో తీవ్ర మనస్తాపానికి చెంది తన ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పక్కనే ఉన్న జనసైనికులు అతన్ని అమరావతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అమరావతి ప్రభుత్వ హాస్పటల్లో ఉన్న జన సైనికుడు పెరుమాళ్ళ వీరాంజనేయులుని హాస్పటల్ లో కలిసి వారి యోగ క్షేమాలను తెలుసుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వ డాక్టర్ని కలిసి ఆయనకు మెరుగైన వైద్యం అందించాల్సిగా కోరడం జరిగింది. తర్వాత లింగాపురం గ్రామాన్ని సందర్శించి అక్కడ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి సోమవారం రాత్రి జరిగిన సంగతిని వివరంగా తెలుసుకోవడం జరిగింది. తర్వాత లింగాపురం సచివాలయం సెక్రటరీతో మాట్లాడి మీరు అధికార పార్టీకి కొమ్ము కాయ కుండా న్యాయపరంగా అందరికీ సముచిత న్యాయం చేయవలసిందిగా కోరటం జరిగింది. ఇదే విషయం మరల రిపీట్ జరిగితే మేము రోడ్లెక్కి నిరసన తెలియ జేస్తాం అవసరమైతే అధికారులను నిలదిస్తామని.. మా లింగాపురం గ్రామానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసారు.