ఎన్ లక్ష్మీ రెడ్డిపల్లి గ్రామానికి న్యాయం చేయండి: డాక్టర్ యుగంధర్ పొన్న

*సర్వరంగ సమగ్రాభివృద్ధి జరిగేటట్టు చర్యలు చేపట్టండి
*మండల అధికారులకు వినతిపత్రం సమర్పించిన జనసేన ఇంచార్జ్

గంగాధర నెల్లూరు మండలం, నెల్లేపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని ఎన్ లక్ష్మి రెడ్డి పల్లి గ్రామంలో నెలకొన్న సమస్యలపై మండల అధికారులను కలిసి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న వినతిపత్రం సమర్పించారు. కాలనీ ఏర్పాటు మొదలుకొని కాలువలు లేక కలుషితమై, నిత్యం బురదతో నిండి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ సూపరిండెంట్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. గత ఎన్నో సంవత్సరాలుగా మురుగునీటి కాలువలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందని కోరారు. మండల తహసీల్దార్ ని కలిసి, గ్రామానికి స్మశాన వాటికకు స్థలం మంజూరు చేయాలని కోరారు. తాసిల్దార్ సానుకూలంగా స్పందించి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాం అని చెప్పారు. గంగాధర నెల్లూరు మండలం చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారిణిని కలిసి గ్రామానికి అంగన్వాడి భవనం నిర్మించాలని, వినతి పత్రం సమర్పించారు. ఈ సమస్యకు తగిన పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ఎన్నో లక్ష్మి రెడ్డి పల్లి గ్రామాన్ని పారిశుద్ధ్య రహిత గ్రామంగా మార్చాలని, ఈ గ్రామానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు సురేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటాద్రి, సూర్య, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవేంద్ర, మండల నాయకులు జిసన్, సురేష్, గజేంద్ర, చందు, దేవరాజులు, నివాస్, సుధాకర్, బూపాల్, హేమంత్, జనసైనికులు పాల్గొన్నారు.