పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత మీకు ఉందా?? .. బొద్దాని శ్రీనివాస్, గంటా ప్రసాద్

ఏలూరు నియోజకవర్గం: ఏలూరు జనసేన కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. ఈ సమావేశంలో భాగంగా నగర జనసేన అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్ మాట్లాడుతూ.. ఏలూరు నియోజకవర్గంలో అధికార పార్టీకి సంబంధించి కొంతమంది బానిస జీవితాన్ని అనుభవిస్తున్నారు.. వారు కళ్ళు తెరిచి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం పనులు చేస్తున్నారు అనేది తెలుసుకోవాలని, ఆ తర్వాతే మీరు ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడాలని, అంతేగాని ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేయడం సరైన విధానం కాదని, అలాగే రాష్ట్రంలో 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే సొంత కష్టార్జితంతో 30 కోట్ల రూపాయలను కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చిన ఘనత ఒక పవన్ కళ్యాణ్ గారికి చెందింది. అటువంటి వ్యక్తిని మీరు ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే ఏ పనులు చేశారని చెప్పి ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉన్నదని, అలాగే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పీకలేరు అనే వ్యాఖ్య చేసిన మీకు మీ ప్రభుత్వం 2024లో బోడి గుండు అయిపోయే పరిస్థితికి వస్తుందని కాశీ నరేష్ విమర్శించారు.. అనంతరం మండల అధ్యక్షులు వీరంకీ పండు మాట్లాడుతూ బీసీలకు జగన్ ప్రభుత్వం ఉద్ధరించింది ఏమీ లేదని, కేవలం పదవులు ఇచ్చి వాళ్ళ హక్కులను జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద పెట్టుకోవడం బీసీలకు సరైన న్యాయం అందిందా అని వైసిపి నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాం.. అలాగే రాష్ట్రంలో ఏ మూలకి వెళ్లిన అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, ఇసుక ధంధాలు, భూ దందాలు వంటివి వైసిపి ప్రభుత్వంలో విపరీతంగా జరుగుతున్నవి.. ప్రజలు వీటన్నిటికీ స్వస్తి చెప్పాలని ఒక నిర్ణయానికి వచ్చి 2024లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలని అనుకుంటున్నారు. దానికి మేమంతా కూడా సంసిద్ధంగా ఉన్నాం. మీరు ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారిపై అవాకలు చవాకులు పేలితే ఊరుకునేది లేదని వీరంకీ పండు ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శులు బొండా రాము, బొత్స మధు, పసుపులేటి దినేష్, కందుకూరి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు..