కప్పలదొడ్డిలో గడపగడపకు తిరిగే అర్హత నీకుందా జోగి?: ఎస్ వి బాబు

పెడన నియోజకవర్గం, గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో రాత్రిపూట మట్టి దొంగతనం చేస్తూ, పగటిపూట గడపగడపకు అంటూ కప్పలదొడ్డి గ్రామంలో తిరుగుతూ మీరు చేస్తున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. ఆ మట్టి అక్రమ రవాణాలో నీ వాటా ఎంతో ప్రజలకు తెలుసు. ప్రతిరోజు ప్యాకేజీ ముట్టకుండా మీ ఇంటి గడప తొక్కని నీలాంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గురించి విమర్శించడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ముందు నువ్వు చేస్తున్న పాపాలను ఆపి, నువ్వు పునీతుడవని నిరూపించుకుని తరువాత పవన్ కళ్యాణ్ ని విమర్శించు. చెప్పేది శ్రీరంగనీతులు చేసేది అక్రమ మట్టి తవ్వకాలని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.