వర్ధంతి ఎరుగని సుభాష్ చంద్రబోస్ జయంతి

  • కూకట్పల్లి నియోజకవర్గ జనసేన కంటేస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

కూకట్ పల్లి నియోజకవర్గం: కేపీహెచ్ బి 5వ ఫేస్ జనసేన పార్టీ ఆఫీస్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలలో కూకట్పల్లి నియోజకవర్గ జనసేన కంటేస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొని నేతాజీ పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యంగా చెప్పుకునే పేరుల్లో సుబాష్ చంద్రబోస్ ఒక రని దేశాన్ని కాపాడుకోవాలంటే అహింస ఒక్కటే మార్గం కాదు, పోరాటాలుకూడా చేయాలి అంటూ గాంధీకి వ్యతిరేకంగా పోరుబాట పట్టి మిస్టరీగా చనిపోయిన నేతాజీ పుట్టినరోజు ఈ రోజు అని అన్నారు. అనంతరం కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ లో నేతాజీ చంద్రబోస్ గారి విగ్రహానికి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, పండుగ సూర్య తదితరులు ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, అన్నపురెడ్డి వెంకటస్వామి, పసుపులేటి ప్రసాద్, సుబ్బు, సురేష్, సమ్మెట నరేంద్ర, మధు, కిరణ్, శేఖర్, హర్ష, శ్రీనివాస్ రావు, నాగయ్య, వీరమహిళ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.