జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కోట్లు ఖర్చు పెట్టి గర్జన చెయ్యాలా?: వంపురు గంగులయ్య

విశాఖపట్నం అక్కయపాలెం, జనసేనపార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వారి సమస్యలు జనవాణి కార్యక్రమానికి హాజరై నివేదించారు. ఈ జనవాణి కార్యక్రమానికి అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ నిరంకుశ ధోరణి, జనసేనపార్టీ నాయకులను, జనసైనికులను అక్రమ అరెస్టులు చేసి గృహానిర్బంధం చేసి అడ్డుకోవాలని ప్రయత్నించిందని కానీ జనవాణి కార్యక్రమం సజావుగానే సాగిందని ఉత్తరాంధ్ర నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారని, చక్కటి సమన్వయంతో జనసైనికులు, వీరమహిళలు, జనసేనపార్టీ ఐటి విభాగ నాయకులతో ఈ కార్యక్రమం సజావుగానే సాగిందని ముఖ్యంగా భూ కబ్జాలకు, సంబంధించిన సమస్యలు ఎక్కువ వచ్చిందని ఈ భూకబ్జాకు ప్రధాన మూలాలు ఎక్కడి నుంచో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని, ఈ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించదు, పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తున్న జనసేన నాయకులను అక్రమ అరెస్టులు చేసిందని, వైసీపీ ప్రభుత్వం చేసిన గర్జన కార్యక్రమానికి కాలేజ్ స్టూడెంట్స్ ని తరలించారు, డ్వాక్రా మహిళలను బెదిరించి భయపెట్టి తరలించారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా? అధికారంలో ఉన్న ప్రభుత్వం గర్జన ఎందుకు చేస్తుంది? జనసేనపార్టీ నిర్వహించే జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కోట్లు ఖర్చు పెట్టి గర్జన చెయ్యాలా? ఇది చాలదా వైసీపీ ప్రభుత్వం జనసేన పార్టీని చూసి భయపడిందని, చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు. దీనిని ప్రజాపాలన అంటారా? ప్రజలు తెలుసుకోవాలని ఈ సందర్బంగా డా.వంపురు గంగులయ్య తెలిపారు. అలాగే అల్లూరిసీతారామరాజు జిల్లా ప్రకటించిన తర్వాత మా ప్రాంత సమస్యలు మరింత జఠిలమైందని గిరిజన నిరుద్యోగులకు కల్పతరువు లాంటి జీవో నెం3 రద్దు, ఏజెన్సీ ప్రాంతంలో శిశు మరణాలు అధికం, రోడ్డు రవాణా వ్యవస్థ, ప్రజావైద్యావసరాలు, కొత్తగా మా అటవీ సంపదను నిర్వీర్యం చేసి గిరిజనులకు స్థిర నివాసాలతో సహా నాశనం చేసే హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ నిర్మాణాలు ఇలా ఏజెన్సీ ప్రాంతంలో సుమారు పది ప్రాంతాలుగా గుర్తించి త్వరలో ప్రభుత్వం టెండర్ పిలిచే అవకాశాలు లేకపోలేదని, పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వివిధ ప్రాంతాల సమస్యలు వంటి పలు అంశాలపై జనవాణిలో కార్యక్రమంలో తెలిపామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాడేరు నియోజకవర్గం నుంచి ఇన్ఛార్ డా.గంగులయ్యతో పాటుగా జి.మాడుగుల మండల అధ్యక్షులు, మసాడి భీమన్న, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్, చింతపల్లి నాయకులు బుజ్జిబాబు, రవి, పండు, మసాడి సింహాచలం, కిల్లో అశోక్ తెరవాడ వెంకట రమణ తదితర జనసైనికులు పాల్గొన్నారు.