మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన దొడ్డిగర్ల సువర్ణరాజు

గోపాలపురం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గురువారం గోపాలపురం నియోజకవర్గం, గోపాలపురం మండలం, కొవ్వూరుపాడు గ్రామంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన మొక్కజొన్న రైతులను ఆ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు ప్రగడ రాంబాబు ఆధ్వర్యంలో గోపాలపురం నియోజకవర్గం నాయకులు దొడ్డిగర్ల సువర్ణరాజు పార్టీ నాయకులతో కలిసి పర్యటించి, పంట నష్టం జరిగిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించి మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా పంట చేతికొచ్చి అమ్ముకునే టైంకి ఈ అకాల వర్షాల కారణంగా నష్టపోయి బాధపడుతున్నటువంటి ప్రతి రైతుకి కూడా దూరదృష్టితో ఆలోచించి స్పష్టమైన నిర్ణయం తీసుకుని నేను ఉన్నానని రైతులకు సహాయం చేస్తానని ఒక స్పష్టమైన అధికారిక ప్రకటన చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ గౌస్, సత్యనారాయణ, పోలుమాటి నాని, మరియు గ్రామ నాయకులు చిలక వెంకన్న, వేగివాడ నాగేశ్వరరావు, శ్రీను, బాబు, తాతారావు, రవి కిరణ్, మంగరాజు, మోహన్, వీర మహిళ శాంతి జనసేనకులు తదితరులు పాల్గొన్నారు.