డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం 31వ వారం

పిఠాపురం నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి పిఠాపురం నియోజకవర్గము జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ఏర్పాటుచేసిన శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం నందు గత 30 వారాలుగా ప్రతి శనివారం రైతులకు అన్నసదుపాయమును కల్పించుచున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 30వ వారం ఈ శనివారం జనసేన నాయకులు, సాయిప్రియ సేవాసమితి వ్యవస్దస్దాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు స్వయంగా 800 మంది రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చిన ఔట్ పేషెంట్లకు కలిపి అన్న సదుపాయమును కల్పించారు. ఈ కార్యక్రమంలో
పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లంకిషోర్, జ్యోతుల సీతరాంబాబు, నక్కామణికంఠ, జ్యోతులకృష్ణ, బోత్సశ్రీకాంత్, ఎద్దురాజు, జ్యొతుల నాని, పోట్టినురి గణేష్, కొలా నాని, విప్పర్తి శ్రీను తదితరులు ఆహరపానీయ వడ్డనలో తమ సేవలను అందించారు. శ్రీమతి డోక్కా సీతమ్మ అన్నపానీయ
సదుపాయ కేంద్రమునకు శ్రమశక్తి ద్వారా సేవలందిస్తున్నారని వారికి నా ప్రత్యేకమైన దన్యవాదాలను తెలియజేయుచున్నానని ఇందుమూలంగా జ్యోతుల శ్రీనివాసు ఒక ప్రకటనలో తెలియజేశారు.