నదుల అనుసంధానాన్ని కోరుతూ భారత దేశ సైకిల్ యాత్ర

కర్నూల్: భారతదేశంలో ఉన్నటువంటి నదులన్నిటినీ అనుసంధానం చేయాలని కోరుతూ తమిళనాడుకు చెందిన ఎశ్ సంజీవ్ అనే వ్యక్తి భారత దేశ వ్యాప్తంగా సైకిల్ యాత్రను చేపట్టారు. తమిళనాడులోని తిరుత్తినిలో బయలుదేరినటువంటి ఈ సైకిల్ యాత్ర పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, గోవా, గుజరాత్ డిల్లీ తెలంగాణ రాష్ట్రాలను చుట్టుకుని శనివారం కర్నూలుకు చేరుకున్నారు. కర్నూలు జనసేన పార్టీ నాయకుడు కొణిదెల శ్రీనివాస్ రెడ్డి సైకిల్ యాత్రకు స్వాతం పలికి, యాత్రకు తన సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా సైకిల్ యాత్రికుడు ఎశ్ సంజీవ్ మాట్లాడుతూ భారతదేశంలోని నదులన్నీటిని అనుసంధానం చేసి, దేశమంతటా సస్యశ్యామలంగా ఉండాలనేది తన ఆకాంక్ష అన్నారు. వరదల వల్ల కొన్ని లక్షల టిఎంసిల నీరు వృధాగా సముద్రం పాలవుతుందని, నదుల అనుసంధానం చేస్తే నీరును వృధా కాకుండా కాపాడుకోవచ్చునని సంజీవ్ అన్నారు. జనసేన నాయకుడు కొణిదెల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నదుల అనుసంధానం కోరుతూ తమిళనాడు నుంచి సైకిల్ యాత్ర చేపట్టడం ఒక సాహసం అన్నారు. ఎటువంటి స్వార్థం లేకుండా శ్ సంజీవ్ ఈ కార్యానికి పూనుకోవడం అభినందించదగ్గ విషయమని అన్నారు. సంజీవ్ చేపట్టిన ఈ సావాస యాత్రను గుర్తించి కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం పై స్పందించి త్వరగతిన ఒక నిర్ణయం తీసుకుని నీరు వృధా కాకుండా కాపాడాలని కోరారు.