డొక్కా సీతమ్మ అన్నసదుపాయ కేంద్రం 6వ వారం

పిఠాపురం పశువుల సంత నందు ప్రతివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదర్శంతో గత 5 వారాలుగా నిర్వహిస్తున్న శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నసదుపాయ కేంద్రం నందు శనివారం ఉదయం రైతులకు, పశువుల బేరాల మద్యవర్తులకు, వివిద హాస్పటల్ ఔట్ పేషెంట్ లకు కలిపి 630 మందికి అన్నసదుపాయంను నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు కల్పించారు. కార్యక్రమంలో పిఠాపురం పట్టణ జనసైనికులు వేమనమంది కృష్ణంరాజు, స్వచ్చ గొల్లప్రోలు సభ్యులు కర్రి కొండలరావు{మాష్టారు}, అల్లం శ్రీను, రెడ్డి మనోహర్, అల్లం వాసు, బొత్స శ్రీకాంత్, ముత్యాల రాజు, రాయవరపు నవదీప్, జ్యోతుల నాని, విప్పర్తి శ్రీను, కొలా నాని తదితరులు స్వచ్చందంగా సేవలు అందించారు.