విద్యార్థుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌

వీసా విధానంలో ఎన్నో మార్పులు తీసుకువసచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విదేశీ విద్యార్థుల విషయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించారు. విద్యార్థులెవరైనా అమెరికా విద్యా సంస్థల్లో ఆన్‌లైన్‌ మాధ్యమంలో బోధనను ఎంపిక చేసుకునేటట్లయిటే అటువంటివారిని తమ దేశంలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సెప్టెంబర్‌ నుండి ప్రారంభంకాబోయే సెమిస్టర్‌లో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులెవరూ దేశంలోకి అడుగు పెట్టకూడదoటూ అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ (ఐసీఈ) ఒక ప్రకటనలో తెలిపింది. అయితే దీనికి కటాఫ్‌ తేదీని మార్చి 9గా నిర్ణయించడం జరిగింది.