రక్తదానం చేసి ప్రాణదాతలు అవ్వండి- డాక్టర్ కందుల నాగరాజు

వైజాగ్ సౌత్: ప్రాణం కన్నా విలువైనది ఈ ప్రపంచంలో మరొకటి లేదని, అలాంటి విలునవైన ఓ ప్రాణాన్ని రక్తదానం చేసి రక్షించడం కన్నా గొప్ప సంతృప్తి కూడా ఇంకోటి లేదని దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్, వాసవి ఇంటర్నేషనల్ వి. 201 ఏ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. ఆదివారం వాసవి క్లబ్ ఫ్యామిలీస్ వరల్డ్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. డాక్టర్ కందుల నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించారు. పలువురు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. దాతల నుంచి 50 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని ప్రతీ ఒక్కరూ విధిగా రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. ఒక్క వ్యక్తి రక్త దానం చేస్తే ముగ్గురుకి ప్రాణదానం చేసినట్లేనన్నారు. రక్తదానం చేయడం వల్ల క్యాన్సర్ తో బాధపడుతున్న అవకాశాలు ప్రత్యేకంగా పెద్దపేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్ లు రాకుండా అడ్డుకుంటుందన్నారు. అధిక రక్త పోటును నియంత్రిస్తుందని చెప్పారు. రక్త దానం చేసినప్పుడు, రక్త పరిమాణం సమతుల్యం చెంది రక్తపోటును నిరోధిస్తుందని అన్నారు. కాబట్టి ఒక ఆరోగ్యకరమైన గుండె, గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి రక్తదానం చేయడం మంచిదని అన్నారు. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి రక్తదానం చాలా ఉపయోగపడుతుందన్నారు. చాలా మందిలో ఇప్పుడు కూడా రక్తదానం పై అపోహలు ఉన్నాయి అన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని చెప్పారు. సామాజిక బాధ్యతగా స్పందించి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షురాలు భువనేశ్వరి, క్లబ్‌ సభ్యులు కౌసల్యాదేవి, సంతోషి, శివకుమార్‌, కార్యక్రమ ఇంచార్జి మెజెటి పాండు, గ్రంధి దేవి, పెదమల్లు రామారావు, కందుల బద్రీనాథ్, కందుల కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు.