అధైర్య పడొద్దు, అండగా జనసేన ఉంటుంది: బండారు శ్రీనివాస్

  • అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా జనసేన ఆర్థిక సాయం

డా.బి.అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం పెదపళ్ల గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇంఛార్జి బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలమూరు మండల జనసైనికులు ఆర్థికసాయం అందించారు. పెదపల్ల గ్రామంలో గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్న దివ్యాంగుడైన తాతపూడి చిన్నరాజు ఇంటికి జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోవడంతో ఆ బాధిత కుటుంబాన్ని బండారు శ్రీనివాస్ పరామర్శించి బాధితుడు చిన్న రాజుకు ఆయన 10,000 రూపాయల నగదు, పిలపళ్ళ గ్రామ సర్పంచ్ సంగీతా సుభాష్ 5000/- పెదపల్ల గ్రామ జనసైనికులు 3000/- అందచేశారు. ఈ సందర్బంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ తాతపుడి చిన్నరాజు వాలంటీర్ గా పనిచేస్తూ జీవితం కొనసాగిస్తున్న తరుణంలో అగ్నిప్రమాదం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని వాపోయారు. మానవతా పిలుపు మేరకు స్పందించి సహాయం అందించిన ప్రతి జనసైనికుల ఉదారత స్వభావం అభినందనీయం అని అన్నారు. నియోజకవర్గ జనసైనికులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన కళ్యాణ్ ఆశయాలు పాటిస్తూ పలు స్వచ్చంద సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అభినందనీయం అని ధన్యవాదాలు తెలియచేసారు. అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన బండారు శ్రీనివాస్ ను , జనసైనికులను గ్రామస్తులు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో గారపాటి త్రిమూర్తులు, సంగీత సుభాష్, తాళ్ల డేవిడ్, కొత్తపల్లి నగేష్, తోట వెంకటేశ్వరరావు, కుడిపూడి దుర్గ ప్రసాద్, పనుమళ్ల సాయి, మకరేడి బాబి రామకృష్ణ, గుత్తుల శ్రీనివాస్, పిల్లి శంకరం, కటమూరి సాయి, యనమదల శ్రీనివాస్ వంగవరపు కూమరు, కడలి వెంకటేశ్వరరావు, బొక్క సోమరాజు, కడలి మణికంఠ, పేయిల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.