అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు జనసేన సంఘీభావం

అమరావతి రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రలో భాగంగా శనివారం రేపల్లె నియోజకవర్గం చెరుకపల్లి చేరుకుంది. రైతులు చేస్తున్న ఈ మహా పాదయాత్రకు సంఘీభావంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొని రైతులు మద్దతుగా వారితో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ… కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రాజధాని నిర్మించుకోవడానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు ఆరోజు ఉన్నటువంటి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు పూర్తిగా సమ్మతి తెలిపి ఇక్కడ రాజధాని నిర్మిస్తాం అంటేనే భూములు స్వచ్ఛందంగా రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు అని తెలుసుకోవాలని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం నాకు చేతకాదు అలాంటి వాటికి మా పార్టీ వ్యతిరేకమని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి అతను చేస్తున్నది ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కాదా అని ప్రశ్నించారు. ఈ సీఎం మొన్న తీర్మానం చేశారు ఈ రాష్ట్రంలో పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొల్యూషన్ కి ఏర్పడటానికి కారణమైన ప్లాస్టిక్ ని ఫ్లెక్సీలను పూర్తిగా బ్యాన్ చేస్తున్నాము తక్షణం ఇది అమల్లోకి వస్తుంది అని ప్రకటించారు కానీ ఈరోజు అధికార పార్టీ వారు రైతులు చేస్తున్న పాదయాత్రకు వ్యతిరేకంగా అడుగు అడుగునా ఫ్లెక్సీలతో నిరసన కార్యక్రమం చేపట్టి దానికి కాపలాగా ఒక ఫ్లెక్స్ కి ఒక పోలీస్ ని కాపలాగా ఉంచటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. వాళ్ళ ఫ్లెక్స్ ల వలన పొల్యూషన్ రాదా…మేము ఫ్లెక్సీలు వేస్తేనే పొల్యూషన్ వస్తుందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నారదాసు రామచంద్ర ప్రసాద్, మేకల రామయ్య యాదవ్, మత్తి భాస్కరరావు, అప్పారావు, సూర్యనారాయణ, చందోలు ప్రసాద్, కాజా నాగేశ్వరరావు, యర్రగోపుల నాగరాజు, శిఖా బాలు, కొర్రపాటి నాగేశ్వరరావు, నాగిశెట్టి సుబ్బారావు, యర్రసాని నాగభూషనరావు, షేక్ కరిముల్లా, షేక్ బుడే, శిదాంతి శ్రీధర్, తన్నీరు గంగరాజు, బోడపాటి శ్రీను, అందే సాంబశివరావు, పోలిశెట్టి గోపి, కొమ్మూరి శ్రీనివాసరావు, మత్తి సుధాకర్, లింగినేని శ్రీనివాసరావు, విశ్వనాధుల ఉదయ్ కృష్ణ, నరేష్, రాధంశెట్టి మహేష్ పాల్గొన్నారు.